Labels

Sunday, August 11, 2013

Allari Naresh
Industry : Telugu
Biography:
అల్లరి నరేష్

పుట్టినతేది: 30 జూన్ 1982 
ఇతరపేర్లు: ఇ.నరేష్
తండ్రిపేరు: ఇ.వి.వి. సత్యనారాయణ  

కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ వారసుడుగా తెలుగు సినీప్రపంచానికి 'అల్లరి' సినిమాతో పరిచయం అయిన నరేష్ మద్రాస్ లో పుట్టిపెరిగాడు. నరేష్ తెలివి తేటలు చూసి తనలా దర్శకుడు అవుతాడు అనుకున్న ఇ.వి.వి. ఆలోచనను తలక్రిందులు చేస్తూ నటుడిగా స్థిరపడ్డాడు. 2002 లో రవి బాబు దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి' సినిమాతో హీరోగా పరిచయం అయిన నరేష్ ఆ సినిమా విజయవంతం అవటంతో 'అల్లరి' నరేష్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎత్తుగా గడకర్రలాగా, నవ్వుతెప్పించే ముఖంతో, కొంటె డైలాగులతో, హాస్యాన్ని పండించటానికి అవసరమైన టైమింగ్ తో తెలుగు సినీపరిశ్రమలో రాజేంద్రప్రసాద్ తరవాత పూర్తి స్థాయి హాస్య కధనాయకుడిగా  కొనసాగుతున్నాడు. కేవలం హాస్యకధా చిత్రాలకే పరిమితం కాకుండా 'నేను', 'విశాఖ ఎక్స్ ప్రెస్', 'శంభో శివ శంభో' వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా పరిపూర్ణత సాదిస్తున్నాడు. ముఖ్యంగా 'గమ్యం' సినిమాలో 'గాలి శీను' పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మినిమం గ్యారంటీ బిజినెస్ ఉన్న నటుడుగా కేవలం ఎనిమిది సంవత్సరాల వ్యవదిలోనే దాదాపు 40  చిత్రాలలో పనిచేసి కొత్త తరం యువనటులకు సవాలు విసురుతున్నాడు. నేటితరం యువ హీరోల్లో సంవత్సరానికి 2 సినిమాలు విడుదల అయ్యేట్టు చూసుకునేవాళ్ళు చాల అరుదు, అలాంటిది నరేష్ సంవత్సరానికి 4 చిత్రాలు సరాసరిన సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. 2008 లో ఏకంగా ఎనిమిది సినిమాలు విడుదల అవటంతో 'స్టార్ అఫ్ ది ఇయర్ ' గా నిలిచాడు అల్లరి నరేష్. కత్తి కాంతారావు విజయంతో 2010 సంవత్సరాన్ని ముగించిన నరేష్ ప్రస్తుతం 'అహన పెళ్ళంట '  సినిమా పూర్తిచేసే పనిలో ఉన్నాడు.

అవార్డులు:

2008 - నంది - ఉత్తమ సహాయ నటుడు(గమ్యం)
2008 - ఫిలిం ఫేర్ - ఉత్తమ సహాయ నటుడు(గమ్యం)

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More