Labels

Sunday, August 11, 2013

అల్లు అర్జున్

పుట్టినతేది: 8 ఏప్రిల్ 1983
ఇతరపేర్లు: బన్నీ, స్టయిలిష్ స్టార్ 
తండ్రిపేరు: అల్లు అరవింద్
తల్లిపేరు: శ్రీమతి నిర్మల
భార్యపేరు: స్నేహ(నిశ్చితార్ధం జరిగినది 26 అక్టోబర్ 2010)

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ 'డాడీ' సినిమాలో ప్రత్యెక పాత్రలో నటించి ఆకర్షించాడు. ఆ తరవాత  అనూహ్యంగా వచ్చిన 'గంగోత్రి' (2003) సినిమాలో అవకాశంతో పూర్తిస్థాయి నటుడిగా మారాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా, తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ తెరంగేట్రం తేలికగానే జరిగింది, కానీ దానిని సద్వినియోగం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎర్పరచుకోవటంలో అల్లు అర్జున్ కృషిని అభినందిచవలసిందే. గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా  యువత మనసులో స్థానం సంపాయించాడు. ఆర్య తో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తరవాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్ తో హట్రిక్ పూర్తిచేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడనుంచి  చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక  ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇజ్ తో, డాన్సులో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు.

'పరుగు' లో కృష్ణ గా చక్కని నటనతో ఆకట్టుకుని, 'వేదం' తో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతే కాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకుని  సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత  అల్లుఅర్జున్ ది. అప్పటి వరుకు హీరో సన్నగా ఉన్న, లావుగా ఉన్న పరవాలేదు అన్న నేపద్యం నుండి పర్ఫెక్ట్ బాడీ ఉండాలి అనే నానుడి కి కారణం అయ్యాడు. అల్లు అర్జున్ ని చూసే తెలుగు హీరోలందరూ జిమ్ కు బానిసలయ్యారు అనటంలో అతిసయోక్తి లేదు. ప్రస్తుతానికి 'బద్రినాద్' ను పూర్తి చేసే పనిలో ఉన్న బన్నీ 2011 కొత్త సంవత్సరంలో   
స్నేహరెడ్డి తో కలిసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

అవార్డులు:

నంది అవార్డులు:
2004 - ఆర్య - స్పెషల్ జ్యూరి
2008 - పరుగు - స్పెషల్ జ్యూరి

ఫిలింఫేర్:
2008 - ఉత్తమ నటుడు.

0 comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More