Bala KrishnaBiography:
పుట్టినతేది: 10 జూన్ 1960
ఇతరపేర్లు: బాలయ్య, యువరత్న, నటసింహ
తండ్రిపేరు: శ్రీ నందమూరి తారక రామారావు
తల్లిపేరు: శ్రీమతి బసవతారకం
భార్యపేరు: శ్రీమతి వసుంధర
కుమారులు: మోక్షజ్ఞ తారకరామతేజ
కుమార్తెలు: శ్రీమతి బ్రహ్మిని, కుమారి తేజస్విని
నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దానవీర సూరకర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు. 1984 లో మంగమ్మగారి మనవడు సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి సూపర్ హిట్ లతో తెలుగు సిని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒక్కరిగా ఉన్నారు. యన్.టి.ఆర్ తరవాత పౌరాణిక, జానపద చిత్రాలలో ఆకట్టుకునేవిధంగా నటించగల సత్తా బాలయ్యకే ఉంది అని 'బైరవ ద్వీపం', 'శ్రీకృష్ణార్జున విజయం' వంటి చిత్రాలతో నిరూపించాడు.
పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలోను, పౌరుషాన్ని గాంభీర్యంగా ప్రదర్శించడంలో బాలయ్యకు మించినవాళ్ళు ఈతరంలో లేరు అనటం లో అతిశయోక్తి లేదు. బాలయ్య కు ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు ఉన్నాయి. కానీ ప్రతి పరాజయాల పరంపరను ఓ బ్లాక్ బాస్టర్ హిట్ తో తుడిచేయటం బాలయ్య అలవాటు. ఆ కోవలోకే వస్తాయి ముద్దుల కృష్ణయ్య, లారి డ్రైవర్, సమరసింహా రెడ్డి, సింహ సినిమాలు.
ఎప్పటికైనా గోనగన్నారెడ్డి, చంగీజ్ ఖాన్ చిత్రాలు రుపొందించాలన్నది బాలయ్యకల. సినిమాలు కాకుండా 2009 శాసనసభ ఎన్నికల కోసం తెలుగు దేశం పార్టీలో చేరి ప్రచారం చేసారు. 2014 ఎన్నికల సమయానికి పార్టీలో కీలక బాద్యతలు చేపట్టే అవకాశం ఉంది.
అవార్డులు:
* 1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు.
* 2001 లో 'నరసింహనాయుడు' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం.
* నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.
* 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు.
0 comments:
Post a Comment